అదనపు కలెక్టర్ విక్టర్...
కామారెడ్డి (విజయక్రాంతి): కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి వర్ధంతి వేడుకను అధికారికంగా ఆదివారం రోజున కలెక్టరేట్ లో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వెంకటస్వామి చిత్ర పటానికి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలం పాటు కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహించారని, దళిత, బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారనీ అన్నారు. వర్ధంతి వేడుకలో కలెక్టరేట్ సూపరింటెండెంట్ జ్యోతి, వెంకట్ రాజు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.