25-02-2025 12:09:58 AM
కంగ్టి, ఫిబ్రవరి 24 : కంగ్టి మండల పరిధిలోని వివిధ గ్రామాల దళితబంధు లబ్ధిదారులు సుభాష్ చంద్రబోస్ కూడలిలో సోమవారం ధర్న నిర్వహించారు. వారికి సంఘీభావంగా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ హయంలో ఖేడ్ నియోజకవర్గ వ్యాప్తంగా 839 దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్రౌండింగ్ చేయకపోవడం ద్వారా దళిత కుటుంబాలు ధర్నా చేయడం జరిగిందన్నారు. వెంటనే దళిత బంధు లబ్ధిదారులకు అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకట్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు విశ్వనాథ్, ఫిదా దళిత బంధు లబ్ధిదారులు బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.