calender_icon.png 12 January, 2025 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణదేవరాయ పాత్రలాగే డాకు మహారాజ్ గుర్తుండిపోతుంది

11-01-2025 12:00:00 AM

బాలకృష్ణ తన కెరీర్‌లో నటిస్తున్న మరో వైవిధ్యభరితమైన చిత్రం ‘డాకు మహారాజ్’. బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నా రు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుందీ సినిమా. ఈ నేపథ్యంలో చిత్రబృందం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది.

ఇదే వేదికపై మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘తిరుమల తొక్కిసలాట ఘటన నన్ను ఎంతో కలిచివేసింది. ఆ ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ‘ఆదిత్య 369’ లో నేను పోషించిన కృష్ణదేవరాయ పాత్ర చిరస్థాయిగా నిలిచిపోయింది. అలాంటి పాత్ర చేస్తే బాగుంటుందనే ఆలోచన నుంచి ఈ ‘డాకు మహారాజ్’ కథ పుట్టింది.

సంక్రాంతికి విడుదలైన నా సినిమాలన్నీ ఘన విజయం సాధించాయి. ‘డాకు మహారాజ్’తో మరో విజయాన్ని అందుకుంటాననే నమ్మకముంది’ అన్నారు. కథానాయిక ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ.. ‘నా అభిమాన సహ నటుల్లో ఒకరైన బాలకృష్ణతో వరుస సినిమాలు చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’ అన్నారు. మరో హీరోయిన శ్రద్ధాశ్రీనాథ్ మా ట్లాడుతూ.. ‘బాలకృష్ణ లాంటి ఒక లెజెండ్‌తో కలిసి నటించడం అదృష్టంగా భావి స్తున్నాను.

ఆయన్ను కలవడానికి ముం దు చాలా భయం ఉండేది. కానీ కలిసిన క్షణాల్లోనే నన్ను చాలా కంఫర్టబుల్ చేసేశారు. పెద్ద స్టార్ అయినా డౌన్ టు ఎర్త్ ఉంటారు. అందుకే ఆయన్ను గాడ్ ఆఫ్ మాసెస్ అంటారని తెలిసిపోయింది’ అ న్నారు. ‘బాలకృష్ణతో కలిసి నటించడం గౌరవం గా భావిస్తున్నాను’ అని ఊర్వశి రౌతేలా తెలిపారు. దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ.. ‘బాలకృష్ణ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు.

ఆయనతో కలిసి పనిచేస్తే ఆయనను ప్రేమిస్తాం, అభిమానిస్తాం. ఆయనతో మళ్లీ మళ్లీ కలిసి పని చేయాలనిపిస్తూ ఉంటుంది’ అని చెప్పారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “ఐదేళ్ల క్రితం వైకుంఠ ఏకాదశి రోజు ‘అల వైకుంఠపురములో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాం. ఆ సినిమా జనవరి 12 ఆదివారం విడుదలైంది. ఇప్పుడు ‘డాకు మహారాజ్’ కూడా ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను” అన్నారు. వైజాగ్ ఎంపీ భరత్, నందమూరి తేజస్విని, సంగీత దర్శకుడు తమన్, ఛాయాగ్రాహకుడు విజయ్ కన్నన్, రచయిత మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.