calender_icon.png 25 February, 2025 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దక్షిణకాశీ.. మేళ్లచెరువు శివాలయం

25-02-2025 01:17:34 AM

మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబు

హుజూర్ నగర్, ఫిబ్రవరి 24: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో ని మేళ్లచెరువు లో అంగరంగ వైభవంగా ఐదు రోజులపాటు శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.దక్షిణ కాశీగా పిలవబడే ఈ ఆలయానికి తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్ర రాష్టం నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ జాతరలో ఎద్దుల పందాలు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ పోటీలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి.

 శివలింగం విశిష్టత... 

ఇక్కడ నానాటికి శివలింగం ఎత్తు పెరగడం,తల మీద గంగమ్మ,అర్ధ నారీశ్వర రూపంతో  స్వయంభుగా వెలసిన క్షేత్రం సూర్యపేట జిల్లా మేళ్లచెరువు లో ఉంది. పుష్కర కాలానికి ఒక అంగుళం చొప్పున  శివలింగం వృద్ధి చెందడం, లింగం శిరస్సు భాగం నుంచి బిలం రావడం, శివరాత్రి సందర్భంగా ఐదు రోజులు పాటు ఉత్సవాలు నిర్వహించడం, ఇలా ఎన్నో ప్రత్యేకతలకు నెలవైనది ఈ ఆలయం.దేవదేవుడు ఇక్కడ శంభు లింగేశ్వరుడిగా పూజ లు అందుకుంటున్నాడు. పంచభూతాలలో ఉండే శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయి. అందులో ఒకటి మేళ్లచెరువు లో ఉన్న శ్రీ ఇష్టకామేశ్వరి సమేత స్వయంభు  శంభు లింగేశ్వర స్వామి ఆలయం.

 ఆలయ చరిత్ర.. 

 12 వా శతాబ్దంలోనే ఈ ఆలయ నిర్మాణానికి పునాది పడిందని స్థలపురాణం తెలియజేస్తుంది. పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో ఉండేది చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పశువుల కాపరులు తమ ఆవులను ఇక్కడికి మేతకు తీసుకొచ్చేవారు. వాటిని ఒకచోట కట్టి ఉంచేందుకు ఒక కొట్టాన్ని ఏర్పాటు చేసుకున్నారు.ఆవుల మందలోని ఒక ఆవు రోజు కొట్టంలోని ఒక గుండ్రాయి మీద రోజు పాలు అభిషేకించడం గమనించిన కాపాలదారుడు పెద్దలకు తెలియజేయాలని బయలుదేరాడు.

ఆ రోజు రాత్రి పరమశివుడు పల్లె పెద్ద అయినా  గంగన్న,బోయిన్నా మంగన్న, బోయన్నలకు స్వప్నంలో సాక్షాత్కరించాడు. తాను పరమశివుడినని కొట్టంలో గుండ్రాయి రూపంలో కొలువై ఉన్నానని తనకు ఆలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపిస్తాడు. పరమశివుని ఆజ్ఞ ప్రకారం వారి తహతకు తగ్గట్లుగా ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు.

1311వ సంవత్సరానికి చెందిన కాకతీయ రాజు ప్రతాపరు ద్రుడు ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు ఆలయంలో ఉన్న శాసనాల ద్వారా అర్థం అవుతుంది. కాలక్రమేనా ఆలయం శిథిలావస్థకు చేరడంతో 1989లో జీర్ణోద్ధరణ చేపట్టారు.ఆలయ జీర్ణోదన్నకు మేళ్లచెరువుకు చెందిన గుండ్లపల్లి చంద్రమ్మ అనే భక్తురా లు లక్షల విరాళాన్ని నాడు అందజేసింది.

ఎద్దుల పందాలు ప్రత్యేక ఆకర్షణ: 

మేళ్లచెరువు లోని శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీశైలం శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం సందర్భంగా  నిర్వహించే ఎద్దుల పందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.తెలంగాణ,ఆంధ్ర రాష్ట్రాల నుంచి ఎద్దుల పందాలలో పాల్గొంటాయి. ఇక్కడ గెలుపొందిన  ఎద్దులకు బహుమతులుగా ట్రాక్టర్లను, బుల్లెట్లను  అందజేస్తారు. 26.02.2025 స్వామి వారికి మహాశివరాత్రి సందర్భంగా మహాన్యాస పూర్వక రుద్రాభి షేకములు ,అమ్మవారికి కుంకుమ పూజలు,రాత్రి స్వామి వారికి 12 గంటలకు శివ పార్వతులకు ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది అని తెలి పారు.

 కొంకపాక ధనుంజయ శర్మ,  ఆలయ అర్చకులు