14-02-2025 01:02:52 AM
* పాడి రైతుల ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నర్సింహారెడ్డి, మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్
* కడ్తాల్ లో పెద్దఎత్తున ఆందోళన
* హైదారాబాద్, శ్రీశైలం జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకోరోడ్డుపై పాలు పారబోసి నిరసన
కడ్తాల్, ఫిబ్రవరి 13 ( విజయ క్రాంతి ) : పాల బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ విజయ పాడి రైతులు రోడ్డెక్కారు. ఐదు బిల్లులు రాకపోవడంపై ఆగ్రహిం చారు. పెండింగ్ పాల బిల్లులను వెంటనే చెల్లించాలని గురువారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ పాలశీతలీకరణ కేంద్రం ఎదుట హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
కడ్తాల పాలశీతలీ కరణ కేంద్రం పరిధిలోని పాలసేకరణ కేంద్రాల అధ్యక్షులు, పాడి రైతులు, బిఆర్ అస్ నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రాష్ట్ర సర్పంచుల సంఘము అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నర్సింహా రెడ్డి, మాజీ జడ్పిటిసి దశరథ్ నాయక్ పాల్గొని మాట్లా డారు.
పెండింగ్ లో ఉన్న ఐదు బిల్లులను వెంటనే చెల్లించాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహిం చారు. పాడి పరిశ్రమ ఆధారంగా జీవనం సాగిస్తున్న రైతులకు నెలల తరబడి బిల్లులు చెల్లించక పోవడాన్ని నిరసిస్తూ పాలు పారబోసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కడ్తాల్ విజయ కేంద్రం పరిధిలో 62సొసైటీల ద్వారా 76సేకరణ కేంద్రాల ద్వారా కడ్తాల్ పాలశీతలీకరణ కేంద్రానికి రైతులు పాలు పోస్తారు.
కానీ ఐదు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని మొత్తం రూ. 16కోట్లు రావలిసి ఉందని ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో సింగల్ విండో చైర్మన్ వెంకటేష్, మాజీ వైస్ ఎంపిపి ఆనంద్, మాజీ ఉప సర్పంచి కడారి రామకృష్ణ, రైతులు, నాయకులు పాల్గొన్నారు.