calender_icon.png 4 December, 2024 | 2:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డిని సన్మానించిన ఎమ్మెల్యే పాయం

03-12-2024 10:23:13 PM

మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐటిసి గెస్ట్ హౌస్ లో ప్రజా పాలన విజయోత్సవ సంబరాల సభకు మొట్టమొదటిసారిగా పినపాక నియోజకవర్గానికి విచ్చేసిన తెలంగాణ డైరీ కార్పొరేషన్ చైర్మన్, ప్రజా పాలన సంబరాల పినపాక నియోజకవర్గ కోఆర్డినేటర్ గుత్తా అమిత్ రెడ్డిని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శాలువాతో సత్కరించారు. అనంతరం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, మండల నాయకులు ఇంగువ రమేష్, పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.