06-03-2025 12:00:00 AM
మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్
మాసాయిపేట(వెల్దుర్తి), మార్చి 5: పాడి పశువులకు ఎలాంటి వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు, వ్యాక్సినేషన్ లు చేయాలని పశువైద్య అధికారులకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మాసాయిపేట మండల కేంద్రంలో ఉన్న పశు వైద్యశాలను బుధవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పలు రికార్డులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యులు సమయపాలన పాటించాలని ఆదేశించారు. పశువులకు వ్యాధులు రాకుండా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.పశువులకు అందిస్తున్న వైద్య సేవలు పరిశీలించారు. పశు వైద్యశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పాడి పశువుల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులుపాల్గొన్నారు.