15-04-2025 12:00:00 AM
ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 14(విజయక్రాంతి) : రాజీవ్ యువ వికాసం పథకంతో కుటీర పరిశ్రమలు, పాల ఉత్పత్తి కేంద్రాలు(డైరీ), కూరగాయల సాగు, ఫ్లోరికల్చర్ చేసి వ్యాపారం చేయడం ఉత్తమమని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి అన్నారు. సోమవారం నాంపల్లి ఎగ్జిబిషన్‌గ్రౌండ్స్‌లో జరిగిన తెలంగాణ రైతుల మహోత్సవం రైతు మేళా ముగింపులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో కూరగాయలు, పువ్వుల కొరత తీవ్రంగా ఉందని, వాటి సరఫరాపై యువత దృష్టి సారిస్తే ఆర్థిక స్తోమత పెరుగుతుందన్నారు.
ప్రతీ రోజు ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు, పువ్వులు దిగుమతి అవుతున్నాయన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ప్రభుత్వం అందించే సబ్సీడీతో ఈ వ్యాపారం నిర్వహించి లాభాలు పొందచ్చని సూచించారు. మొక్కజొన్న, గోధుమలతో వాల్యూ యాడెడ్ ఉత్పత్తి వ్యాపారం, పౌల్ట్రీ, గుడ్ల వ్యాపారం, చిరుదాన్యాల సాగు మంచిదన్నారు. కార్యక్రమంలో హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ రాజిరెడ్డి, అగ్రికల్చర్ హార్టికల్చర్ సొసైటీ కార్యదర్శి జీ.వీ రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.