19-04-2025 02:02:54 AM
హుజూర్ నగర్, ఏప్రిల్ 18: పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకుఅనుగుణంగా రైస్ మిల్లులో పనిచేసే దినకూలి రేట్లు పెంచాలని అందుకు రైసుమిలు యాజమన్యం స్పందించి రోజువారి కూలీ 600 రూపాయలు పైగా పెంచాలని టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్ శీతల రోషపతి కోరినారు. హుజూర్నగర్ లో రైస్ మిల్లర్ అసోసియేషన్ భవన్లో కార్మిక సంఘాలు మిల్లర్స్ ల జాయింట్ చర్చలు జరిగినాయి.
గతంలో రోజ కూలి కార్మిక సంఘాలు 700 రూపాయలు ఇవ్వాలని కోరినారు.ఇరువురి చర్చలు అనంతరం యాజమాన్యం రూ.530లు పెంచుటకు ఉన్న వేతనంపై రూ.30 పెంచుతామని అనడంతో కార్మిక సంఘాలు కార్మికులు ఉన్న వేతనం రోజు రూ.600లకు పైగా పెంచాలని కోరారు.
అనంతరం చర్చలు ఆదివారంకి వాయిదా పడ్డాయని రోషపతి తెలిపారు. యాజమాన్య స్పందించి ఆదివారం జరిగు చర్చల్లో రోజువారి వేత నంతో పాటు అలవెన్సులు ప్రమాద బీమా, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరినారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు పోలిశెట్టి లక్ష్మీనర్సి రావు,గజ్జి ప్రభాకర్ ,గెల్లి అప్పారావు, కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.