- ప్రీలాంచ్, ట్రేడింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్, గాడిదపాల ఫ్రాంచైజీల పేరుతో అమాయకులకు గాలం
- అత్యాశతో అప్పులపాలవుతున్న నగరవాసులు
- పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 19 (విజయక్రాంతి): నగరంలో రోజుకో కొత్త తరహా మోసం వెలుగులోకి వస్తోంది. అయితే ప్రతీ దాంట్లో ప్రజలు మోసపోయే తీరు విస్మయం కలిగిస్తోంది.
ఎక్కువగా చదువుకోని వారు మోసపోతున్నారంటే అది వారి అమాయకత్వం అని భావించవచ్చు.. అయితే ఉన్నత విద్యావంతులు, సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా సైబర్ నేరాలబారిన పడుతున్న తీరు ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. డబ్బు ఆశ తో కొందరు.. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించాలనే అత్యాశతో మరి కొందరు నిండా మునుగుతున్నారు.
తాము పొదుపు చేసుకున్న డబ్బే కాకుండా అప్పు లు చేసి మరి పెట్టుబడులు పెడుతున్నారు. ఆ తర్వాత సదరు కంపెనీల చేతిలో మోసపోయి అప్పులు తీర్చే మార్గం కనబడక కొం తమంది పోలీసు స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతుంటుంటే మరికొందరు ఏం చేయా లో తోచక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు
* ఈనెల 18న సువర్ణభూమి ఇన్‌ఫ్రా డెవలపర్స్ రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడి పెట్టిన తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని పలువురు కొంతమంది సాఫ్ట్‌వేర్, రిటైర్డ్ ఉద్యోగులు సదరు సంస్థ ఎండీ శ్రీధర్‌పై హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. బై బ్యాక్ స్కీమ్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట తమను మోసం చేశారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు 200 మంది బాధితులు ఉన్నారని, ఒక్కొక్కరి నుంచి రూ.30 లక్షల నుంచి రూ. కోటి వరకు వసూలు చేసినట్లు తెలిపారు. మొత్తం స్కామ్ రూ.200 కోట్లు వరకు ఉంటుందని బాధితులు చెప్పారు.
* ఈనెల 16న నగరానికి చెందిన ఓ వ్యా పారికి వాట్సాప్‌లో ఒక మేసేజ్ వచ్చిం ది. ట్రేడింగ్‌లో పెట్టుబడులపై ఆసక్తి ఉంటే తమను సంప్రదించాలని మేసేజ్ సారాంశం. దీంతో ఆసక్తి కనబర్చిన బాధితుడు వారు సూచించిన ఫోన్ నంబర్‌కు కాల్ చేసి ట్రేడింగ్ సంబంధించిన వివరాలు తెలుసుకున్నాడు. అనం తరం పలు దఫాలుగా మొత్తం రూ.48.97 లక్షలు పెట్టుబడులుగా పెట్టాడు.
ఇలా పెట్టిన పెట్టుబ డులకు లాభాలు వచ్చాయని మొత్తం రూ. 62.13 లక్షల నగదును విత్‌డ్రా చేసుకోవాలని స్కామర్లు చెప్పారు. కానీ, బాధితుడు వాటిని ఉపసంహరించుకోవడానికి ప్రయత్నిం చినప్పుడు స్కామర్లు లావాదేవీని తిరస్కరించారు. విత్ డ్రా చేసుకోవడానికి ఆదనంగా 27 శాతం పన్ను చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో ఇదంతా మోసమని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశాడు.
* ప్రస్తుత కాలంలో గాడిదలు తక్కువగా ఉండటం, వాటి పాలను ఉత్పత్తి చేసేవారు లేకపోవడంతో.. మార్కెట్లో దీనికున్న డిమాండ్‌ను ఆసరాగా తీసుకుని తమిళనాడుకు చెందిన ఓ ముఠా.. తెలుగు రాష్ట్రాల్లోని ఔత్సాహితక రైతులకు.. గాడిదపాల ఉత్పత్తి, లాభాల పేరుతో ఆశచూపి మోసం చేసింది. ఫ్రాంచైజీ మోడల్‌లో గాడిదపాలు తీసుకున్న సదరు సంస్థ సుమారు 200 మంది బాధితులకు రూ.100 కోట్లు ఎగవేసిందని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. చైన్నైలోని డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజీ గ్రూప్ సభ్యులు తమను నమ్మించి మోసం చేశారని.. తమకు న్యాయం చేయాలని మీడియా ఎదుట బాధితులు వాపోయారు.
* ఈనెల 15న ‘12 వెల్త్ క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ’ అనే సంస్థ డబుల్ గోల్డ్, బైబ్యాక్ పాలసీ స్కీమ్‌ల పేరుతో సుమారు 3,600 మంది నుంచి దాదాపు రూ.300 కోట్ల డిపాజిట్ల మేర వసూలు చేసి, బాధితులకు ఇచ్చిన హామీ మేరకు వడ్డీ డబ్బులు చెల్లించకుండా మోసానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో బాధితులంతా కలిసి తమకు ఈఓడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కొత పంథాలో నేరగాళ్లు
మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్థిక నేరగాళ్లు కొత్త పంథా ఎంచుకుంటున్నారు. రోజుకో కొత్త రకం పద్ధతుల్లో ప్రజలను మోసం చేసి అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రీ లాంచ్ ఈవెం ట్స్, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్, తాజాగా గాడిదపాల వ్యాపారం అంటూ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతూ ప్రజలను నిలు వు దొపిడీ చేస్తున్నారు.
కేవలం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) పరిధిలోనే ప్రతి ఏడాఇ నమోదవుతున్న కేసుల్లో ఆర్థిక నేరగాళ్లు రూ.వేల కోట్లు కొల్లగొడుతున్నారనే నివేదికలు ఇప్పు డు సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా, నేరగాళ్లను పట్టుకొని కటకటా ల్లోకి నెట్టినా ప్రజల్లో మార్పు రానంతవరకు ఇలాంటి మోసాలను ఆరికట్టడం కష్టమని సైబర్ నిపుణులు చెబుతున్నారు.
తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే అతి తక్కువ సమయంలో ఎక్కు వ లాభం ఇస్తామని చెబితే నమ్మకండి.. పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టాలని వారు హెచ్చరిస్తున్నారు.