calender_icon.png 1 October, 2024 | 6:03 AM

మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

01-10-2024 03:12:41 AM

కేంద్ర ప్రభుత్వం 2022 సంవత్సర దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును బాలీవుడ్ దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తికి ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు. 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం అక్టోబర్ 8న జరుగుతుంది.

ఇదే వేదికపై మిథున్ చక్రవర్తికి అవార్డును అందజేస్తారు. మిథున్ చక్రవర్తి పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో 1950. జూన్ 16న జన్మించారు. 1976లో ‘మృగయ’ అనే సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. బెంగాలీతోపాటు బాలీవుడ్‌లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగానే 

కాకుండా క్యారెక్టర్ 

ఆర్టిస్ట్‌గా, విలన్‌గానూ మెప్పించారు. తెలుగు, కన్న డ, ఒరియా, భోజ్‌పురి చిత్రాల్లోనూ కనిపించారు. పవన్‌కళ్యాణ్, విక్టరీ వెంకటేశ్ నటించిన ‘గోపాల గోపాల’లో స్వామిజీగా తెలుగువారికి పరిచయమయ్యా రు. తర్వాత ‘మలుపు’ అనే మరో టాలీవుడ్ చిత్రం ద్వారా పలుకరించారు.

మిథున్‌కు ఫాల్కే అవార్డు ప్రకటించిన నేపథ్యంలో సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తు న్నారు. టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ మిథున్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం, స్టార్ హీరో పవన్‌కల్యాణ్ కూడా మిథున్‌కు అభినందనలు తెలియజేస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.