calender_icon.png 2 November, 2024 | 12:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాన్న అస్వస్థతకు గురయ్యారు

02-11-2024 12:00:00 AM

ప్రముఖ నటి సుహాసిని తండ్రి, సీనియర్ నటుడు, దర్శకుడు చారుహాసన్ అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి ఆయన అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు చారుహాసన్‌ను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుప్రతికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ విషయాన్ని సుహాసిని మణిరత్నం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహిస్తున్నారన్నని ఆమె తెలిపారు.

“దీపావళికి ముందు మా నాన్న అస్వస్థతకు గురయ్యారు. మా పండుగంతా ఎమర్జెన్సీ వార్డులోనే గడిచిపోయింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించనున్నారు” అని తెలిపారు. చారు హాసన్‌కు 93 ఏళ్లు. ఈ ఏడాది ఆగస్టులోనూ ఒకసారి ఆయన ఆసుపత్రి పాలయ్యారు.

వయసు కారణంగా వచ్చే అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. చారుహాసన్ తమిళంలో మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ప్రేక్షకులకూ సుపరిచితమే. ఈ ఏడాది ఆరంభంలోనూ ‘హర’ అనే తమిళ చిత్రంలో ఆయన కనిపించారు.