29-03-2025 11:54:31 PM
ఐకమత్యానికి మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు..
పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. ఇఫ్తార్ అనేది ముస్లింలు రంజాన్ లో నమాజ్ ఏ సహెర్ తర్వాత ఉపవాస దీక్ష చేపట్టిన తర్వాత ప్రారంభమవుతుంది. కఠోరమైన దీక్ష ఉపవాసంలో భాగంగా సూర్యాస్తమయం సమయంలో నమాజ్ ఏ మగ్రిబ్ సామూహిక నమాజ్ కంటే ముందు ఫలహారాలతో ఉపవాస దీక్ష విరమింప చేశారు.
అనంతరం మాజీ ఎంపీపీ ప్రతాపరెడ్డి మాట్లాడుతూ... రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనదని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని అల్లాహ్ అందరినీ చల్లగా చూడాలని ఈ ఉపవాస దీక్ష లక్ష్యం మనిషిలో దైవభీతి దేవుడి పట్ల నమ్మకం మొదలైన మహత్తర సుగుణాలను పెంపొందింప చేయడమే అని అన్ని మతాలు చెప్పేది సారం ఒకటేనని అందరు కలిసి మెలిసి సోదర భావంతో ఉండాలని తెలిపారు.
అనంతరం మైనారిటీ నాయకులు మహమ్మద్ రియాజుద్దీన్ మాట్లాడుతూ... ఐకమత్యంగా దావత్ ఏ ఇఫ్తార్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని గత కొన్ని సంవత్సరాలుగా ఇఫ్తార్ విందు మాజీ ఎంపీపీ ఇస్తున్నారని సోదర భావంతో ఐకమత్యం వెలసిల్లేలా చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తిరుమలరెడ్డి, సాయిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చైర్మన్ హనుమంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి , హనుమంత్ రెడ్డి, విట్టల్, ప్రేమ్ సింగ్, భాస్కర్ రెడ్డి, మండలం మైనారిటీ నాయకులు మహమ్మద్ రియాజుద్దీన్, షేక్ మహమ్మద్, సయ్యద్ పాషా, సయ్యద్ జాఫర్, ఎస్.కె రషీద్, ఉస్మాన్ షా, జలాల్, అబ్దుల్ జావిద్, షేక్ జావీద్, సయ్యద్ అతిక్, తదితరులు పాల్గొన్నారు.