26-04-2025 12:02:57 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 25 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి శుక్రవారం వివిధ మండలాల్లో దాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల ప్రకారం ధాన్యాన్ని బాగా ఆరబెట్టి శుభ్రం చేసి తీసుకురావాలని, సన్న ధాన్యానికి ప్రభుత్వం అమలు చేస్తున్న క్వింటాలుకు 500 రూపాయల బోనస్ పొందే విధంగా కృషి చేయాలన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఏవైనా సమస్యలు తలెత్తుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. డి ఏ ఓ వెంట ఏడిఏ శ్రీనివాసరావు, ఏవో వెంకన్న ఉన్నారు.