04-03-2025 01:59:11 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): నగరంలోని కూకట్ పల్లిలో మంగళవారం ప్రమాదం చోటుచేసుకుంది. కూకట్ పల్లిలోని గ్యాస్ ఫిల్లింగ్ దుకాణంలో ఆకస్మాత్తుగా గ్యాస్ సిలిండర్ పేలింది. అక్రమంగా చిన్న సిలిండర్లో గ్యాస్ ఫిల్లింగ్ చేస్తుండగా పెద్ద ఎత్తున్న మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న శంకర్ కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన శంకర్ ను పరిక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కూకట్ పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.