calender_icon.png 20 November, 2024 | 10:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండియా, పాక్‌పై సైక్లోన్ ఎఫెక్ట్

31-08-2024 02:07:04 AM

  1. భారీ వర్షాలతో అతలాకుతలమైన అరేబియా సముద్ర తీర ప్రాంతాలు 
  2. స్కూళ్లు బంద్, భారీగా ప్రాణ, ఆస్తి నష్టం

న్యూఢిల్లీ, ఆగస్టు 30: అరేబియా సముద్రం వెంబడి ఉన్న భారతదేశం, పాకిస్థాన్ దేశాల్లోని తీర ప్రాంతాలను ఆగస్టు నెలలో ఏర్పడిన సైక్లోన్లు అతలాకుతలం చేశాయి. పశ్చిమ భారతదేశంలోని మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోని పలు నగరాలను ఆగస్టులో వచ్చిన వరదలు ముంచెత్తాయి. దీంతో రోజుల తరబడి విద్యాసంస్థలు మూసివేయడంతో పాటు భారీగా ఆస్తి, ప్రాణ నష్టం చోటుచేసుకుంది. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆయా రాష్ట్రాల్లోని వాహనాలు వరద ప్రవాహాల్లో కొట్టుకుపోగా.. రోడ్లు ధ్వంసం అయ్యాయి. గుజరాత్ రాష్ట్రంలో వరదల కారణంగా దాదాపు 28మంది మరణించారు.

పాకిస్థాన్‌లోని సముద్ర తీర ప్రాంతాలైన.. కరాచీలో వరదల కారణంగా పాఠశాలలు, వ్యాపార సంస్థలు మూసివేయబడ్డాయి. ఇళ్లు మునిగిపోవడంతో వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో అరేబియా సముద్రం వెంబడి మరో అల్పపీడనం ఏర్పడిందని శుక్రవారం సాయంత్రం నాటికి అది తుఫానుగా మారనుందని.. రానున్న రెండు రోజుల పాటు తీర ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రాలు వెల్లడించిన నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విపత్తు నివారణ చర్యలు తీసుకోవాలని రెండు దేశాల ప్రభుత్వాలు అధికారులను ఆదేశించాయి.