09-02-2025 11:08:16 AM
మణుగూరు, (విజయక్రాంతి): సైకిల్ పై ప్రయాణం ఆరోగ్యానికి మాత్రమే కాదు పర్యావరణానికి, ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని రిటైర్డ్ టీజీ ఆర్టీసీ ఉద్యోగి అంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) మణుగూరు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి కృష్ణ సమాజ హితాన్ని.. ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి సైకిల్ పై ప్రయాణం మేలు చేస్తుందన్నారు. ఆదివారం మణుగూరు మణుగూరు నుంచి కుంభమేళా ప్రయోగరాజ్ వెళ్లేందుకు సైకిల్ యాత్రను చేపట్టారు. ఈ యాత్రను తెలంగాణ ఉద్యమకారుడు వలసల వెంకటరామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
మణుగూరు మండలం, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి జి కృష్ణ మణుగూరు నుండి కుంభమేళా (Prayagraj )కు సైకిల్ పై యాత్రగా బయలుదేరడం, తద్వారా సైకిల్ వినియోగంపై కలిగే ప్రయోజనాలు ప్రజలకు అర్థం అవ్వాలని కృష్ణ ఆకాంక్షించడం అభినందనీయమన్నారు. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళ, హిందువులను జాగృతం చేసే హిందువుల అతిపెద్ద పండుగకు మణుగూరు నుండి సైకిల్ పై వెళ్తున్న కృష్ణ కోరుకున్న విధంగా ఫలితం దక్కాలని ఆకాంక్షించారు. అనంతరం కృష్ణ మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉండాలన్నా, నేటితరానికి కాలుష్య కొరల నుండి ఉపశమనం కలగాలన్నా, దేశానికి చమురు బాధలు తీరాలన్నా, దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ సైకిల్ ను ఉపయోగించాలని కోరారు. సైకిల్ యాత్ర(cycle yatra) ద్వారా పర్యావరణాన్ని రక్షించాలని ప్రచారం చేస్తూ ప్రయాగ్ రాజు లోని కుంభమేళా(Kumbh Mela)కు చేరుకుంటానన్నారు. కార్యక్రమంలో గాండ్ల సురేష్, దుస్సా సమ్మయ్య, ఉపేందర్, ప్రెస్ రిపోర్టర్ సత్యం బాబు తదితరులు పాల్గొన్నారు.