calender_icon.png 19 January, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42 శాతం రిజర్వేషన్‌లు కల్పించాలని ఈ నెల 19 నుండి సైకిల్ యాత్ర...

18-01-2025 11:19:24 PM

ముషీరాబాద్,(విజయక్రాంతి): సమగ్ర కులగణన లెక్కలు తేల్చి 42 శాతం బీసీ వాటాను తేల్చాకే పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఉద్యమిస్తారని వారు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఈ నెల 19న (ఆదివారం) బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కిలాషాపూర్ నుండి ప్రారంభయ్యే బత్తుల సిద్దేశ్వర్ చేసే సైకిల్ యాత్రకు సంబందించిన కరపత్రాలను వారు ఆవిష్కరించారు. అనంతరం వారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హిందూ బీసీ మహాసభ అధ్యక్షుడు బత్తుల సిద్దేశ్వర్, బీసీ కులాల సమన్వయ వేదిక అధ్యక్షుడు బొమ్మ రఘురాం నేత, ఓబీసీ పోలిటికల్ జేఏసీ కన్వీనర్ ఎస్బీఎన్ చారీ, బీసీ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు కోట్ల వాసుదేవ్‌లు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి యేడాది పూర్తి అయినా బీసీల పట్ల కపట బుద్ది ప్రదర్శిస్తుందని వారు దుయ్యబట్టారు. ఈ నెల 19న జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కిలాషాపూర్ నుండి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని నియోజక వర్గాలలో 4 వందల కిలోమీట్లు అ4 రోజుల పాటు సైకిల్ యాత్రను చేపడుతున్నట్లు తెలిపారు. సైకిల్ యాత్ర ముగించే లోపు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని అమరణ 42 మంది బీసీ యోధులతో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఆమరణ దీక్షలకు  సమాయాత్తం అవుతారని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు కొంగర నరహరి, దేశం మహేష్ గౌడ్, పర్వత సతీష్, విజయ్ కుమార్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.