24-03-2025 01:20:37 AM
రూ. 2.12 లక్షలు పోగొట్టుకున్న యువకుడు
మందమర్రి, మార్చి 23 : సులభంగా డబ్బు సంపాదించాలని అమాయకులను టార్గెట్ చేసి సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతున్నారు.తాజాగా పట్టణానికి చెందిన యువకుడు సైబర్ మోసగాళ్ళ బారిన పడి 2.12 లక్షలు పోగొట్టుకున్న ఘటన ఆదివారం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే పట్టణానికి చెందిన ఒక యువకుడికి (22 ) గూగుల్ లో రివ్యూ ఇస్తూ డబ్బులు సంపాదించ వచ్చని ఇటీవల టేలిగ్రాంలో ఓ మెసేజ్ వచ్చింది. సదరు యువకుడు దానికి సరే అని అనగా సైబర్ నేరగాళ్లు అతన్ని సుమారు 3000 మంది ఉన్న టేలిగ్రాం గ్రూపులో యాడ్ చేశారు.
ముందుగా కొన్ని డబ్బులు ఇచ్చి తర్వాత ఎక్కువ డబ్బులు సంపాదించడానికి ఇన్వెస్ట్మెంట్ చెయ్యమన్నారు. అధిక డబ్బులకు ఆశ పడిన వ్యక్తి వాళ్ళు చెప్పినట్టు చేయగా మొత్తం 2.12 లక్షలు పెట్టుబడి పెట్టించారు. తర్వాత అ డబ్బులను విత్ డ్రా చేయడానికి ప్రయత్నించగా అవ్వలేదు. సైబర్ నేరగాళ్లను కాంటాక్ట్ చేసినా ఫలితం లేదు. దీంతో మోసపోయానని భావించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.