calender_icon.png 28 February, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయ్

28-02-2025 01:28:33 AM

  1. కేవలం కాలర్ ట్యూన్ పెట్టి వీటిని అరికట్టలేం
  2. ఎంట్రప్రెన్యూర్ టెక్ ఇన్నోవేషన్ సమిట్‌లో కేటీఆర్ 

హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): టెక్నాలజీ ప్రపంచాన్ని మలచడంలో ఉన్న అవకా శాలను వినియోగించుకునేలా నూతన ఆవిష్కరణలు సాగాలని, అవి సమాజా నికి మేలు చేసేలా ఉండాలని తెలంగాణ ఐటీశాఖ మాజీమంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బెంగళూరులో గురువారం జరిగిన ఎంట్రప్రెన్యూర్ టెక్ ఇన్నోవేషన్ సమిట్-2025 లో పాల్గొని ‘డ్రైవింగ్ డిజిటల్ ఇండియా-టెక్నాలజీ అభివృద్ధికి మార్గద ర్శకతలు, ఆవిష్కరణలు’ అనే అంశం పై మాట్లాడారు.

ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ), క్వాంట మ్ కంప్యూటింగ్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ, ఇంటర్నెట్ ఆఫ్ బాడీస్ వంటి సాంకేతిక పరిణామాలు ప్రపంచాన్ని ఎలా మార్చగలవో వివరించారు. సాంకేతికతను బాధ్యతగా ఉపయోగించకపోతే అత్యంత ప్రమాదకరమని కేటీఆర్ హెచ్చరించారు. ప్రపంచంలో సాంకేతిక ప్రగతి పెరుగుతున్న కొద్దీ..

సైబర్ నేరాలు సైతం పెరుగుతున్నాయని, టెక్నాలజీ సామర్థ్యం అధికంగా ఉన్న యువత సైబర్ నేరాలకు ఎందుకు పాల్పడుతున్నారో ఆలోచించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరాలపై అవగాహన కోసం ఒక కాలర్ ట్యూన్ పెట్టడంతోనే వాటిని నిలవరించలేమని కేంద్ర ప్రభుత్వానికి చురకలు అంటించారు.