calender_icon.png 25 November, 2024 | 6:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన

25-11-2024 03:45:47 PM

ముత్తారం,(విజయక్రాంతి): చదువుకునే విద్యార్థులు సైబర్ నేరాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని గోదావరి ఖని ఏసీపీ మడత రమేష్ అన్నారు. సోమవారం ముత్తారం మండలంలోని దర్యాప్తు ఆదర్శ పాఠశాలలో విద్యార్థులతో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఏసీపీ  మాట్లాడుతూ... ఇటీవల కాలంలో ఆన్ లైన్లో మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ఫేస్ బుక్, వాట్సప్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా అనవసరపు అనుచిత ధోరణిలకు ప్రాథమిక దశలోనే చరమ గీతం పాడాలన్నారు. అనంతరం ఆయన పాఠశాల పరిసర ప్రాంతాలు, బాలికల హాస్టల్లో వంటశాలను పరిశీలించి విద్యార్థులకు మంచి భోజనం అందజేయాలని తెలిపారు. ఏ సమయంలోనైనా పాఠశాల మరియు హాస్టల్ ఆవరణలో ఏమైనా అవాంచిత సంఘటనలు ఏర్పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ కోరారు. ఈ కార్యక్రమంలో  మంథని సీఐ రాజు, ముత్తారం ఎస్ఐ  నరేష్, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు