calender_icon.png 25 November, 2024 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబరాబాద్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

25-11-2024 02:47:49 AM

తనిఖీల్లో పట్టుబడ్డ

193 మంది మందుబాబులు 

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 24 (విజయక్రాంతి): సైబరాబాద్ కమిషనరేట్‌లోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. వారాంతాల్లో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. శనివారం రాత్రి సైబరాబాద్ కమిషనరేట్‌లోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 193 మంది మందుబాబులు పట్టుబడ్డారు. వీరిలో 20 ఏళ్ల వయస్సు నుంచి 40 ఏళ్ల లోపు ఉన్నవారు అత్యధికంగా 141 మంది ఉన్నారు.

వీరిలో 19 మందికి పరీక్షల్లో బీఏసీ(బ్లడ్ ఆల్కహాల్ కాంటెంట్) 200 నుంచి 550 శాతం వరకు వచ్చింది. పట్టుబడిన వారిని సోమవారం కోర్టులో హాజరుపరుచనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. డ్రంకన్ డ్రైవ్‌లో ప్రమాదాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 105 కింద అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. ఈ నేరానికి గానూ ౧౦ సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష విధిస్తారని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. మద్యం తాగి వాహనం నడపడం నేరమన్నారు.