calender_icon.png 23 October, 2024 | 8:57 PM

టీనేజర్లకు సైబర్ సేఫ్టీపై రాజు అవగాహన

07-08-2024 12:22:45 AM

నిజామాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): తన కుటుంబం అమెరికాలో స్థిరపడి నా.. స్వదేశంలోని టీనేజర్లకు సైబర్ సేఫ్టీపై అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు మాస్టర్ రాజ్ భీమిడిరెడ్డి. నిజామాబాద్‌కు చెందిన రాజ్ అమెరికాలో పదవ తరగతి చదువుతున్నాడు. సేఫ్ టీన్స్ ఆన్‌లైన్ అనే లాభపేక్షలేని సంస్థను స్థాపించి, స్వదేశంలో టీనేజ్ యువతకు ఆన్‌లైన్ ద్వారా సైబర్ సేఫ్టీపై సెమినార్లు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నాడు.

ఇటీవలి నిజామాబా ద్‌కు వచ్చిన సందర్భంగా పట్టణంలోని ప్రెసిడెన్సీ, ఆర్‌బీవీఆర్‌ఆర్, ఎస్‌ఎస్‌ఆర్ డిస్కవరీ అకాడమీల్లో అవగాహన కల్పించాడు. నిజామాబాద్, హైదరాబాద్‌తోపాటు మహారాష్ట్ర, కర్ణాటకల రాష్ట్రాల్లో సైతం సెమినార్లు నిర్వహిస్తున్నాడు. చిన్న వయస్సులోనే ప్రపంచా నికి తనవంతుగా ఉపయోగపడాలన్న రాజ్ తాపత్రయాన్ని చూసి అనేక మంది అభినందిస్తున్నారు.