calender_icon.png 30 October, 2024 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజామాబాద్ జిల్లాలో సైబర్ మోసం

01-08-2024 12:11:08 AM

రైతు నుంచి రూ.95 వేల లూటీ

నిజామాబాద్, జూలై 31 (విజయక్రాంతి): జక్రాన్‌పల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన ఓ రైతు కుమారుడు హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తి చేసి, ఎంబీఏ చదివే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ క్రమంలో ఆ రైతుకు మంగళవారం ఓ ఫోన్ కాల్ వచ్చింది. హైదరాబాద్‌లోని తన కుమారుడు డ్రగ్స్ కేసులో స్నేహితులతో పాటు అరెస్టు అయ్యాడని, అతన్ని రక్షించాలంటే తమకు ఐదు నిమిషాల్లో రూ.లక్ష పంపాలని హెచ్చరించారు. భయపడిన రైతు రూ.95 వేలు సైబర్ నేరగాళ్లు చెప్పిన నంబర్‌కు ఫోన్ పే చేశాడు. ఆ తర్వతా తన  కొడుక్కు ఫోన్ చేయగా ఎలాంటి కేసులో పట్టబడలేదని తెలిపాడు. మోసపోయనని గ్రహించిన రైతు, వెంటనే జక్రాన్‌పల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ మల్లేష్ తెలిపారు.