calender_icon.png 15 November, 2024 | 11:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్? .. సైబర్ కేటుగాళ్లను పట్టుకోవడం ఎలా ?

13-08-2024 01:29:52 PM

అసలు సైబర్ కేటుగాళ్లను పట్టుకోవడం ఎలా ?

క్యాచ్ మీ ఇఫ్ యూకెన్..? అంటూ నెటిజన్లకు పోలీసులకు అల్టిమేటమ్ ఇస్తూ సవాల్ విసురుతున్న సైబర్ నేరగాళ్ల ఆటకట్టించడానికి .. పలు నకిలీ ఖాతాలు తయారు చేస్పైతున్న ముఠాలపై రాష్ట్ర సైబర్ పోలీసింగ్ విభాగం అధికారులు దృష్టి సారించారు. ఎందుకంటే కొట్టేసిన డబ్బులను నకిలీ ఖతాలలోకి దారి మళ్లించడంలో సైబర్ కేటుగాళ్లు ఆరితేరారు. ఇటీవల నిర్మల్ జిల్లాలో పోలీసులకు అమాయకులైన ఖాతా దారులు మాత్రమే దొరికారు. అసలు కేటుగాళ్లని పట్టకోవడం సవాల్గా మారింది. మ్యూల్ ఖతాలుగా వ్యవహరించే అనుమానాస్పద లావాదేవీలు మరియు కార్యకలాపాలను గుర్తించడానికి బలమైన పర్యవేక్షణ నిఘా వ్యవస్థలను అమలు చెయ్యాల్సి  ఉందంటున్నారు. సైబర్ క్రైమ్ ప్రమాదాలు మరియు తమను తాము రక్షించుకునే మార్గాల గురించి ప్రజలలో చైతన్యం కలిపించలేక పోవడం కూడా వైఫల్యాలకు  కారణం అవుతోంది. సాధారణంగా ఇలాంటి నేరాలలో సిమ్(SIM) కార్డ్ సరఫరాదారులు, దొంగ ఖాతా దారులు తెరవెనుక మంత్రాంగం నడుపుతూ పలు సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు  నిఘా అధికారుల పర్యవేక్షణలో తేలింది. కానీ ప్రస్తుతం ఫిర్యాదు రాగానే కేసులు నమోదు చేసి నగదు బదిలీ నిలిపి వేస్తున్నారు. 


 అంతర్జాతీయ  స్థాయిలో.. దేశాల వ్యూహాత్మక సహకారంతోనే 

సైబర్ నేరాలను సమర్థవంతంగా నిరోధించడానికి నిర్మల్ తరహా ముఠాల ఆట కట్టించడమే  నిజమైన నేరస్థులను పట్టుకోవడానికి చురుకైన  స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించాలని అభి ప్రాయ పడుతున్నారు.పలు ప్రభుత్వ, ప్రభుత్వే తర సైబర్ ఏజెన్సీలు, ఆర్థిక సంస్థలు మరియు టెలికమ్యూనికేషన్ కంపెనీల మధ్య సహకారంతో కూడిన బహుముఖ విధానం అవసరం. అంతర్జాతీయ  స్థాయిలో  వ్యూహాత్మక సహకారంలోనే సరిహద్దు సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి ప్రపంచ భాగస్వాములతో కలిసి పనిచేస్తేనే సదరు కేటుగాళ్లను పట్టు కోవచ్చని అభిప్రాయ పడుతున్నారు