13-02-2025 10:52:07 PM
టెలిగ్రామ్‌లో జాయిన్ అయితే రూ. 80 వేలు గాయబ్..
మరో కేసులో యాప్‌లో డబ్బులు పెట్టి మోసపోయిన మహిళ..
చేవెళ్ల (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పట్టణంలో ఒకే రోజు నమోదైన రెండు వేర్వేరు సైబర్ నేరాలు ప్రజలను ఉలికిపాటుకు గురిచేశాయి. సైబర్ నేరరాళ్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అమాయక ప్రజలను మోసం చేయడం ఆందోళన కలిగిస్తోంది. టెలిగ్రామ్ ద్వారా వచ్చిన సందేశాన్ని ఫాలో కావడం వల్ల ఓ డాక్టర్ రూ.80 వేలు నష్టపోయాడు. మరో కేసులో ఎల్ ఎఫ్ ఎల్ యాప్( LFL App) లో పెట్టుబడి పెడితే డబ్బులు రెట్టింపు వస్తాయని నమ్మిన మహిళ రూ.88,623 పోగొట్టుకుంది. ఈ రెండు ఘటనలపై ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
టెలిగ్రామ్ లింక్ ఓపెన్ చేస్తే డబ్బుల మాయం
పట్నం మహేందర్ రెడ్డి ఆస్పత్రిలో ఎంబీబీఎస్ పీజీ డాక్టర్‌గా పనిచేస్తున్న పవర్ ఆదిత్య అప్పారావు ఫిబ్రవరి 10న సైబర్ మోసగాళ్ల బారిన పడ్డారు. సాయంత్రం 1:00 గంటల సమయంలో వాట్సప్‌లో 8266075602 నెంబర్ నుంచి “మీరు టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి” అని మెసేజ్‌ను వచ్చింది. దీంతో ఆయన ఫాలో అయ్యాడు. కొద్దిసేపటికే అదే నెంబర్ నుంచి “తదుపరి సమాచారం కోసం మా ఛానల్‌లో చేరండి” అని మరో మెసేజ్ వచ్చింది. ఆ సందేశాన్ని ఫాలో అయిన కొద్ది నిమిషాల్లోనే అతని బ్యాంక్ ఖాతా నుంచి రూ. 80,000 కట్ అయిపోయాయి. విస్తుపోయిన ఆదిత్య వెంటనే చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
చైన్ సిస్టమ్ మోసం... రూ. 88,623 నష్టం
చేవెళ్ల టీచర్స్ కాలనీలో నివసించే కూతాడి పుష్పలతకు ఆమె స్నేహితులు ఎల్ ఎఫ్ ఎల్ (LFL App) యాప్లో "పెట్టుబడి పెడితే డబ్బులు రెట్టింపు అవుతాయి" అని చెప్పడంతో నమ్మి గత డిసెంబర్ 8న యాప్‌లో రిజిస్టర్ అయ్యారు. మొదట తొలుత చిన్న మొత్తంలో డబ్బులు పెట్టగా రెట్టింపు రాబడి వచ్చింది. తర్వాత మరింత ధైర్యంతో మొత్తం రూ. 88,623 ఇన్వెస్ట్ చేశారు. కానీ, జనవరి 3 నాటికి ఆ యాప్ ఆకస్మికంగా మూసివేయబడింది. దీంతో మోసపోయానని గ్రహించిన పుష్పలత 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ కు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో కింద కేసు నమోదు చేశారు.
సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలియని నెంబర్ల నుంచి వచ్చిన యాప్ లింకులు క్లిక్ చేయడం గాని, టెలిగ్రామ్ ఛానళ్లలో చేరడం గాని చేయవద్దు. యాప్ ల్లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టొద్దు. ఎప్పుడైనా అలాంటి సందేశాలు వచ్చినప్పుడు 1930 హెల్ప్‌లైన్ లేదా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.