హైదరాబాద్: సైబర్ నేరస్థులు ఓ వృద్ధుడి నుంచి ఏకంగా రూ. 13.26 కోట్ల ను కొల్లగొట్టాడు. ఈ స్థాయిలో మోసపోయిన ఉదంతం దేశంలోనే ఇదే మొదటిదని చెబుతున్నారు. ఆన్ లైన్ బ్రోకింగ్ చిట్కాలు చెబుతాం.. స్టాక్ మార్కెట్ లో షేర్లు ఇవాళ కొని ఇవాళే అమ్మే షార్ట్ సెల్లింగ్ లో పండితులు గా తీర్చి దిద్దుతాం అంటూ ఒక రిటైర్డ్ ఉద్యోగికి ఆన్లైన్ మెసేజీ వచ్చింది. అవి అప్ స్టాక్స్, ఇంటర్నేషనల్ బ్రోకర్స్ (ఐబీ).. తదితర కంపెనీల పేరుతో లింక్ లు పంపించి వాట్సప్ గ్రూప్ లో చేర్చారు. అవి ప్రముఖ కంపెనీలే కావడంతో బాధితుడికి ఎలాంటి అనుమానం రాలేదు. దీంతో నమ్మి సైబర్ కేటుగాళ్లు సూచించిన బ్యాంకు అకౌంట్ కు బాధితుడు 13 కోట్లు బదిలీ చేశాడు. బాధితుడు ఈ నెల 2 న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్ బీ)కు ఫిర్యాదు చేశారు.
మ్యూల్ ఖాతాలో.. క్రిప్టో కరెన్సీ! ప్రధాన సూత్రధారి ఎవరు ?
ప్రదాన నిందితుడు ఎవరో.. తెలియక పోయినా దర్యాప్తులో భాగంగా హిమాయత్ నగర్లో ఉండే మెట్రో రైల్ ఉద్యోగి మహమ్మద్ అతీర్ పాషా(25) పేరుతో మ్యూల్ ఖాతా తెరిచి సదరు అమౌంట్ ను బదిలీ చేసినట్లు కనుగొన్నారు. కాగా దీని వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి (ప్రధాన నిందితుడు) ఎవరు ? ఎక్కడ ఉంటాడో కనుక్కోలేక పోయామని త్వరలోనే కూపీ లాగుతామని పోలీసు అధికారి వివరించారు. అతీర్ పాషా కథనం ప్రకారం తన ఖాతాలో పడిన సొమ్మును విత్ డ్రా చేయించి క్రిప్టో కరెన్సీ లోకి మార్చి ప్రధాన నిందితుడికి పంపించినట్లు వెల్లడించాడు. కాగా ఈ నేరానికి పాల్పడిన ఆన్లైన్ సైబర్ కేటుగాళ్లకి మధ్యవర్తిగా నిలిచిన అరాఫత్ ఖాలేద్ మొహియుద్దీన్(25), సయ్యద్ ఖాజా హషీ మొద్దీన్(24)లను సైతం అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపించారు.