హైదరాబాద్, జనవరి 22: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెక్నాలజీ కంపెనీ సైయంట్ డీఎల్‌ఎం నికరలాభం క్యూ3లో భారీగా తగ్గింది. 2024 అక్టోబర్ క్వార్టర్లో నికరలాభం 41.7 శాతం క్షీణించి రూ.10.8 కోట్లకు పరిమితమయ్యింది.
ఆదాయం మాత్రం 38 శాతం పెరిగ రూ.444 కోట్లకు చేరింది. తాము క్యూ3లో అల్టెక్ ఎలక్ట్రానిక్స్‌ను టేకోవర్ చేయడంతో వ్యయాలు పెరిగి, లాభం తగ్గిందని సైయంట్ డీఎల్‌ఎం బుధవారం తెలిపింది. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు 14 శాతం పతనమయ్యి, 52 వారాల కనిష్ఠస్థాయి రూ.505 వద్దకు తగ్గింది.