calender_icon.png 16 April, 2025 | 8:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఐటీ ఒలంపియాడ్ టెస్టులో సత్తా చాటిన సీవీ రామన్ స్టూడెంట్స్

16-04-2025 01:12:59 AM

హుస్నాబాద్, ఏప్రిల్15 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని సర్ సీవీ రామన్ ఇంగ్లిష్ మీడియం స్కూల్  విద్యార్థులు మరోసారి తమ సత్తా చాటారు. ఈ-అభ్యాస్ ఐఐటి అకాడమీ నిర్వహించిన రాష్ట్రస్థాయి ఒలంపియాడ్ టెస్టులో అద్భుతమైన ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు. ఈ విద్యా సంవత్స రంలో జరిగిన ఐఐటీ ఒలంపియాడ్ పరీక్షలో పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలి తాలు సాధించారు. బుర్ర శ్రీనిధి, నాగిరెడ్డి సాయినివేశ్ రెడ్డి ప్రథమ బహుమతిని సొం తం చేసుకోగా, జీ.అగస్త్య నందన్, ఏ.శ్రీచరిత్, జీ. ఆరుష్ ద్వితీయ బహుమతిని దక్కిం చుకున్నారు.

అలాగే, బీ.రక్షిత్, కే.కౌశిక్, ఏ.మ నోజ్ఞ రెడ్డి, ఎం.సంక్షిప్త్, జీ.ప్రీతిక తృతీయ బహుమతిని సాధించారు. హైదరాబాదులోని భారతీయ విద్యా భవన్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులకు  బహుమతులు ప్రదానం చేశారు. డీఆర్ డీవో పూ ర్వ అధ్యక్షుడు జీ.సతీశ్ రెడ్డి, టీజీపీఎస్ సీ మాజీ చైర్మన్ బీ.జనార్దన్ రెడ్డి, ప్రముఖ దర్శకుడు ఎస్.మీర్  విద్యార్థులకు బహుమతు లు అందజేశారు. తమ పాఠశాల విద్యార్థు లు రాష్ట్రస్థాయిలో ఈ ఘన విజయం సాధించడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయు డు కాయిత నారాయణరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

విద్యార్థులను అభినందిస్తూ,  కష్టపడి చదివితే ఉన్నత స్థానాలకు చేరుకోవ చ్చని అన్నారు. ఈ విజయం సాధించిన వి ద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయ బృం దం, వారి తల్లిదండ్రులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయం సర్ సీవీ రామన్ పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది.