calender_icon.png 24 December, 2024 | 8:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీడియాకు సీవీ ఆనంద్ క్షమాపణ

24-12-2024 01:46:22 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 23 (విజయక్రాంతి): హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాకు క్షమాపణలు చెప్పారు. నేషనల్ మీడియాను ఉద్ధేశించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పోస్ట్ పెట్టా రు. సంధ్య థియేటర్ ఘటనపై జాతీ య మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు తాను సహనాన్ని కోల్పోయినట్లు తెలిపారు. సంధ్య థియేటర్ వద్ద అసలేం జరుగుతుందో తెలుపుతూ సీపీ సీవీ ఆనంద్ తాజాగా ప్రెస్‌మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

థియేటర్‌లో ఆ రోజు ఏం జరిగిందో తెలుపుతూ ఓ వీడియో ప్రదర్శించారు. ఈ క్రమంలో మీడియా ఆయన్ను కొన్ని విషయాలపై ప్రశ్నించగా.. నేషనల్ మీడియా ఈ ఘటనకు మద్దతు ఇస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడ ఉన్న కొందరు జర్నలిస్టులు ఈ ఆరోపణలను తప్పుబట్టారు. తాజాగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు సీవీ ఆనంద్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.