20-04-2025 10:04:04 PM
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహం(SC Girls Hostel)లో అనుమతి లేకుండా సుమారు 20 టేకు చెట్లను నరికి గదిలో నిలువ చేసిన ఘటన ఆదివారం నాడు వెలుగులోకి వచ్చింది. సమాచారం తెలుసుకున్న కామారెడ్డి డిఆర్ఓ అనురంజని ఎల్లారెడ్డి పట్టణంలోని హాస్టల్ కు చేరుకొని పరిశీలించారు.హాస్టల్ ఆవరణలో చెట్లను నరికిన చోట మిగిలి ఉన్న టేకు కట్టెలను సేకరించి, కట్టెలు దాచి నిల్వ ఉంచిన గదిని సీజ్ చేశారు. హాస్టల్ వార్డెన్ శారదను సమగ్ర విచారణ చేసిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్షన్ ఆఫీసర్ గోపాల్ అటవీశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.