calender_icon.png 11 January, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెగిన తాత్కాలిక రోడ్లు

18-07-2024 03:06:47 AM

  • మూడు జిల్లాలతో సంబంధాలు కట్ 
  • ఇబ్బందుల్లో ప్రజలు

జయశంకర్ భూపాలపల్లి, జూలై 17(విజయక్రాంతి): కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలను కలుపుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకమట్ల మండలంలోని చలివాగు మానేరు వాగులలో వేసిన తాత్కాలిక రోడ్లు ఇటీవల కురిసిన వర్షాలకు తెగిపోయాయి. దీంతో ౩ జిల్లాలతో టేకుమట్ల మండలానికి సంబంధాలు తెగిపోయాయి.  టేకుమట్ల మండలానికి చెందిన సింగరేణి కార్మికులు సైతం గోదావరిఖని, మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి గనుల్లో పనిచేస్తూనే ఇక్కడ వ్యవసాయం చేస్తుంటారు.

నిత్యం రాకపోకలు సాగించే రోడ్డు తెగిపోవడంతో ఎక్కడివాళ్లు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రూ.5 కోట్ల వ్యయంతో టేకుమట-్ల మధ్య వంతెన పునర్నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. గర్మిళ్ళపల్లి ఓడేడ్ గ్రామాల మధ్య మానేరులో వంతెన ప్రారంభం కాకముందే గాలికే కూలిపోయింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలకు తంటాలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని రెండు వంతెనలను పూర్తి చేసి టేకుమట్ల మండలానికి రవాణా సౌక ర్యం మెరుగు పర్చాలని ప్రజలు కోరుతున్నారు.