calender_icon.png 3 April, 2025 | 12:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దమ్ముంటే కట్ చేయి.. లైన్ మేను!

28-03-2025 12:56:25 AM

హాస్యాస్పదంగా మారిన వినియోగదారుడి చేష్టలు

పెబ్బేరు మార్చి 27: మండల పరిధిలోని వైశాగాపూర్ గ్రామానికి చెందిన ఓ వినియోగదారుడి చేస్టలు విద్యుత్ అధికారులను విస్మయపరచగా మండల ప్రజలను నవ్వుకునేలా చేసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. గత కొన్ని రోజుల క్రితం విద్యుత్ బకాయిలు చెల్లించలేదని విద్యుత్ అధికారులు, సదరు వినియోగదారుడి విద్యుత్ మీటర్ వద్ద సరఫరా తొలగించి సీలు వేసా రు.

నా ఇంటి కనెక్షన్ తొలగిస్తావా అని ఆక్రోశం తో అధికారులు వేసిన సీలు తొలగించాడు. తిరిగి యధావిధిగా విద్యుత్ కనెక్షన్ ఇవ్వటమే కాకుండా, సీలు వేసే స్థలంలో ఫైబర్ బాక్స్ కు రెండు రంధ్రాలు వేసి తన దగ్గర ఉన్న తాళం వేసి తాళం చెవి తనదగ్గర దాచుకొన్నాడు.

గురువారం బిల్లుల కోసం వెళ్లిన అధికారులకు తాళం దర్శనం ఇవ్వటంతో అవాక్కయ్యారు. సదరు వినియోగదారుడిని ప్రశ్నించగా ఇప్పుడు ఎలా కనెక్షన్ కట్ చేస్తావో చేయి అనే సమాధానం విని అతని అమాయక తెలివికి నవ్వాలో ఎడవాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు.