calender_icon.png 18 April, 2025 | 9:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీలో కోత

16-04-2025 12:55:05 AM

సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు 

ఖమ్మం, ఏప్రిల్ 15(విజయక్రాంతి):-సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కోత విధించడం పట్ల బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షులు తాతా మధు విచారం వ్యక్తం చేశారు. ఖమ్మం లోని తెలంగాణా భవన్ లో జరిగిన సీ ఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం లో అయన మాట్లాడారు.

ఇటీవల జరిగిన శాసనమండలి సమావేశాల్లో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీఎం సహాయ నిధి సహాయం లో పేదల ఆర్థిక స్తోమతను దృష్టిలో పెట్టుకొని ఎంత ఖర్చు చేసిన కేవలం 60 వేలే అందించే విధానాన్ని వీడి, హుందాతనంతో వ్యవహరించి పేదలను ఆదుకోవాలని కోరినా ప్రభుత్వం అదే తీరును అవలంబించడం పట్ల అయన అసహనం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, రూరల్ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, భాషబోయిన వీరన్న, పెనుబల్లి మండల పార్టీ అధ్యక్షులు కనగాల వెంకటరావు, మధిర మండల పార్టీ అధ్యక్షులు రావూరి శ్రీనివాస రావు, మధిర నగర పార్టీ అధ్యక్షులు కరుమూరి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపిపి సామినేని హరిప్రసాద్, నాయకులు పోట్ల శ్రీనివాస్, బంక మల్లయ్య, తాతా ప్రసాద్, పేరం వెంక టేశ్వర్లు, ఉద్యమకారులు పగడాల నరేందర్, లింగనబోయిన సతీష్, డేరంగుల బ్రహ్మం, బొగ్గుల భాస్కర్ రెడ్డి, చామకూరి రాజు, ధనాల శ్రీకాంత్, లెనిన్ చౌదరి, సద్ధాం షేక్, చీకటి రాంబాబు, నెమలికొండ వంశీ,తదితరులు పాల్గొన్నారు.