రాష్ట్రమంతటా కామన్ క్రెడిట్ విధానం
హైదరాబాద్ డిసెంబర్ 29 (విజయకాంతి): డిగ్రీ కోర్సుల స్వరూపాన్ని సమగ్రంగా మార్చేందుకు కసరత్తు చేస్తున్న ఉన్నత విద్యామండలి మరో కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. డిగ్రీ సైన్స్ కోర్సుల క్రెడిట్లకు కోతపెట్టనుంది. ఇప్పటి వరకు సైన్స్ కోర్సుల్లో 160 క్రెడిట్లు ఉండగా, వీటి సంఖ్యను 146కు పరిమితం చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.
ఇదే అంశంపై విషయ నిపుణులు, పలు వర్సిటీల సైన్స్ విభాగాల బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీవోఎస్) చైర్మన్లతో త్వరలోనే సంప్రదిం పులు జరపనుంది. దీంతో లైఫ్ సెన్సైస్ సహా ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సైన్స్ కోర్సుల్లో క్రెడిట్ల సంఖ్య తగ్గనుంది. దీంతో పాటు సైన్స్ కోర్సుల్లో ఒక ప్రాక్టికల్‌ను రద్దు చేయాలని మండలి నిర్ణయం తీసుకుంది.
ఈ ప్రాక్టికల్ స్థానంలో ప్రాజెక్ట్ వర్క్‌ను అంతర్భాగంగా చేయనున్నారు. డిగ్రీ మూడో సంవత్సరంలో నాలుగు థియరీ, నాలు గు ప్రాక్టికల్స్ పేపర్లుండగా, ఒక ప్రాక్టికల్‌కు బదులుగా ప్రాజెక్ట్ వర్క్‌ను చేర్చా లని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను వర్కింగ్ డే లేదా సెలవుల్లో పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు.
రాష్ర్టమంతటా కామన్ క్రెడిట్
ప్రస్తుతం రాష్ట్రంలోని వర్సిటీల్లో క్రెడిట్స్ విధానం ఒకే తరహాలో లేదు. ఒక్కో వర్సిటీలో ఒక్కోలా క్రెడిట్స్ జారీచేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కామన్ క్రెడిట్ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. డిగ్రీలో సం స్కరణలపై కసరత్తు కొలిక్కి వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకొని రాష్ర్టమంతటా అన్ని వర్సిటీల్లో కామన్ క్రెడిట్ సిస్టమ్‌ను అమలు చేస్తారు.
ఇక సైన్స్ కోర్సుల స్వరూపాన్ని ఖరారు చేసేందుకు వర్సిటీల్లోని బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీవోఎస్) చైర్మన్లతో త్వరలో మండలి ప్రత్యేక భేటీకానుంది. అయితే బీవోఎస్ కమిటీల్లోనూ మార్పులు చేయనున్నారు.ఒక్కో వర్సిటీ బీవోఎస్‌లలో ప్రస్తుతం 12 మంది సభ్యులుం టారు.
ఈ బీవోఎస్ కమిటీల్లో ఇండ స్ట్రీ, ఆర్‌అండ్‌డీ నిపుణులను తీసుకుంటా రు. ఉదాహరణకు ఐఐసీటీ శాస్త్రవేత్త లు, ఇక్రిశాట్, అగ్రికల్చర్ ఇండస్ట్రీ, సీఐ ఐ, ఫార్మా ఇండస్ట్రీ నిపుణులను సభ్యులుగా చేర్చుకుంటారు. ప్రభుత్వం నుం చి సైతం నిపుణుడిని తీసుకుంటారు.