ఎస్‌పీడీసీఎల్ ఫైనాన్స్ డైరెక్టర్ సుధామాధురి
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 11 (విజయక్రాంతి): విద్యుత్ సంస్థలకు ప్రధాన ఆదాయవనరుగా ఉన్న వినియోగదారు గౌరవిస్తే.. సమస్యలకు సులభంగా పరిష్కారం లభిస్తుందని టీజీఎస్‌పీడీసీఎల్ ఫైనాన్స్, హెచ్‌ఆర్ డైరెక్టర్ సుధామాధురి సూచించారు. విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ రూపొందించిన 2025 డైరీ, క్యాలెండర్‌ను మింట్ కాంపౌండ్‌లోని విద్యుత్ ప్రభ కార్యాలయంలో జెన్‌కో ఫైనాన్స్ డైరెక్టర్ అనురాధ, ఎన్‌పీడీసీఎల్ ఫైనాన్స్ డైరెక్టర్ తిరుపతిరెడ్డితో కలిసి ఆమె ఆవిష్కరించారు.
అసోసియేషన్ అధ్యక్షులు అశోక్, ప్రధాన కార్యదర్శి అంజయ్య నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థల పురోగతిలో అకౌంట్స్ విభాగం పాత్ర చాలా కీలకమైందన్నారు. 2018 నుంచి భర్తీ కాకుండా ఉన్న 200 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. 2004 నాటికి విధుల్లో ఉన్న విద్యుత్ ఉద్యోగులకు రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జీపీఎఫ్ పరిధిలోకి తీసుకురా కోరారు. ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాస్ ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.