calender_icon.png 10 January, 2025 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కస్టోడియన్ భూములు రైతులకివ్వాలి

03-01-2025 01:13:52 AM

లక్ష్మాపూర్‌లో సీపీఎం ఆందోళన

పటాన్‌చెరు, జనవరి 2 : గుమ్మడిదల మండలం కొత్తపల్లి పంచాయతీ లక్ష్మాపూర్ గ్రామ పరిధిలోని కస్టోడియన్ భూములను రైతులకు పంపిణీ చేయాంటూ సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. సీపీఎం మెద క్ జిల్లా కార్యదర్శి డీఎం ఖాలిక్ ఆధ్వర్యంలో లక్ష్మాపూర్ గ్రామస్తులు గురువారం బొంతపల్లి గ్రామాల మధ్య ఉన్న మల్లికార్జున స్వామి ఆలయం నుంచి కమాన్ వైపు భారీ ర్యాలీ చేపట్టారు.

అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు వారిని నిలువరించారు. ఈ క్రమంలో అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆందోళనకారులను డీసీఎంలో మొదట నర్సాపూర్ వైపు ఆతర్వాత దుండిగల్ వైపు తరలించారు.

కాగా లక్ష్మాపూర్ గ్రామ పరిధిలో సర్వేనంబర్ 1 నుంచి 59 వరకు సుమారు ౧౦౦౦ ఎకరాల వరకు కస్టోడియన్ భూములు ఉండగా ఇందులో దాదాపు 50 సంవత్సరాల క్రితం నల్లగొండ నుంచి ఇక్కడికి వచ్చిన కొంతమంది ౩౦౦ ఎకరాలను సాగు చేసుకుంటున్నారు. ఇంకా 500 ఎకరాలకుపైగాఉన్న భూమిపై తమకు హక్కులు కల్పించాలని గత కొన్నిరోజులుగా లక్ష్మాపూర్ గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు.