calender_icon.png 29 September, 2024 | 7:00 PM

సీతాఫలం కేరాఫ్ పాలమూరు

29-09-2024 12:00:00 AM

పండ్ల విక్రయాలతో ఉపాధి పొందుతున్న కూలీలు 

అటవీ, పొలాల గట్లపై నుంచి సేకరణ n గంప, సంచిని బట్టి ధరలు

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 28 (సెప్టెంబర్): సీతాఫలమంటే ముందుగా గుర్తొచ్చేది మహబూబ్‌నగర్ జిల్లాయే. రాష్ట్రవ్యాప్తంగా ఇక్కడే సీతాఫలాలు అధికంగా దొరుకుతాయి. రుచిగా ఉండటంతో వీటి కి ఇతర ప్రాంతాల్లోనూ డిమాండ్ ఉంది. దీన్ని స్థానిక కూలీలు అవకాశంగా మలుచుకొని తాత్కాలిక ఉపాధి పొందుతున్నారు.

పండ్లను అమ్మ డం ద్వారా రెండు నెలలపాటు పని దొరుకుతుందని.. రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు సంపాదిస్తున్నామని అంటున్నారు. దశబ్దాలుగా కరువు జిల్లాగా పేరొం దిన పాలమూరులో నేటికీ ఉపాధి కోసం తిప్పలు తప్పడం లేదు.

ఈ నేపథ్యంలో తమ కు స్థానికంగా లభించే సీతాఫలాలను సేకరిం చి వాటిని మహబూబ్‌నగర్‌తో పాటు ప్రధా న రహదారుల వద్ద విక్రయించి తాత్కాలిక ఉపాధి పొందుతున్నారు. మహబూబ్‌నగర్ చుట్టుపక్కల ఉన్న అడవులు, గుట్టల్లో రెండు నెలలపాటు సీతాఫలాలు పుష్కలంగా లభిస్తా యి. వీటిని విక్రయించడం ద్వారా ఆ సమయంలో కూలీలకు ఉపాధి లభిస్తుంది.

స్థాని కంగా ఈ పండ్లను ఉపాధి ఫలంగా పిలుచుకోవడం విశేషం. ఒకరోజు పూర్తిగా అటవి ప్రాంతాలకు వెళ్లి ఫలాలను సేకరించి, మరుసటి రోజు వాటిని విక్రయిస్తున్నారు. పండ్లను మహబూబ్‌నగ ర్ నుంచి హైదరాబాద్, కర్నూ ల్, రాయచూర్ తదితర ప్రాం తాలకు తరలిస్తున్నారు. కొం దరు వ్యాపారులు కూలీలను నియమించుకొని పండ్లను సేకరించి ఇతర ప్రాంతాలకు తరలిస్తూ డబ్బులు ఆర్జిస్తున్నారు.

తాత్కాలికంగా ఉపాధి..

గ్రామీణ ప్రాంతాల్లో నివసించే కూలీలకు కరువు పని తప్ప ఇతర పనులు లభించడం గగనమైంది. దీంతో ఉపాధి లేక సీతాఫలాల సీజన్‌లో పండ్లను సేకరించి రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు సంపాదిస్తున్నారు. సేకరించిన పండ్లను జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్, క్లాక్‌టవర్, రైతుబజార్, మెట్టుగడ్డ, అశోక్‌టాకీస్ చౌరస్తాతోపాటు పలు ప్రాంతా ల్లో అమ్ముతున్నారు.

పాలమూరు సీతాఫలానికి భలే గిరాకీ

మహబూబ్‌నగర్ సీతాఫలానికి హైద్రాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లోను డిమాండ్ ఉంది. ఈ పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలతోపాటు ఇక్కడి పండ్లు రుచికరంగా ఉంటాయని చాలా మంది చెబుతున్నారు. స్థానికంగా దొరికే పండ్లను కర్ణా టకలోని రాయచూర్, బెంగళూర్, గుల్బర్గా, గుర్మిటకల్, సేడం తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వ్యాపారస్తులు ఇక్కడి నుం చి సేకరించి ప్రత్యేకం గా మహబూబ్‌నగర్ సీతా ఫలం అంటు మరి డిమాండ్‌గా విక్రయిస్తున్నారు. 

ఉపాధి దొరకక..

ఖాళీగా ఇంట్లో కూర్చోంటే పూట గడవడం కష్టంగా ఉంది. అందుకే సీతాఫలాలు తెంపి విక్రయిస్తున్నా. రెండు నెలల పాటు పనిదొరుకుతుంది. వీటిని అమ్మడం ద్వారా రోజుకు రూ.300 నుంచి రూ.600 వరకు వస్తాయి. ఒక రోజు గుట్టలు, పొలాల దగ్గరకెళ్లి తెంప్పుకొని రావాలి. మరుసటి రోజు అమ్మాలి. ఇంటి ఖర్చులకు అక్కరకు వస్తాయని ఈ పనిచేస్తున్నా. 

 లలిత, నవాబ్‌పేట, మహబూబ్‌నగర్ 

కష్టంతో కూడుకున్న పని

సీతాఫలాలను అమ్మడం చాలా కష్టమైన పని. చెట్టనక పుట్టనక గుట్టల వెంట తిరిగితేనే కాయలు దొరుకుతాయి. పండ్లను తెంపేందుకు ఒక రోజంతా కేటాయించాలి. ఆ రోజు డబ్బులు రావు. మరుసటి రోజు జనాలకు విక్రయించడం ద్వారా నాలుగు రూపాయలు వస్తాయి. రోజూ పనిచేస్తే వచ్చే కూలీకంటే తక్కువ ఆదాయమే వస్తుంది. 

 నర్సింలు, 

మరికల్, మహబూబ్‌నగర్