calender_icon.png 23 October, 2024 | 4:25 AM

సిబ్బంది నిర్లక్ష్యంతోనే విద్యార్థులకు కరెంట్ షాక్

23-10-2024 02:40:56 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి):  సిబ్బంది నిర్లక్ష్యంతోనే నలుగురు గురుకుల విద్యార్థులకు కరెంటు షాక్ వచ్చిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఎక్స్‌వేదికగా స్పందిస్తూ అధికారుల అలసత్వం గురుకుల విద్యార్థులకు శాపంగా మా రిందని ఆరోపించారు. ప్రభుత్వ పట్టింపులేనితనం పిల్లల ప్రాణాల మీదకు తెచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ గురుకులానికి చెందిన నలుగురు విద్యార్థి నులు కరెంట్ షాక్ తగిలి గాయాల పాలవడం దురదృష్టకరమన్నారు. తక్షణం స్పందించి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, మళ్లీ జర గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో పాము కాట్లు, కుక్క కాట్లు, ఎలుక కాట్లు, ఫుడ్ పాయిజన్ కేసులు  సర్వసాధారణం కాగా, ప్రస్తుతం కరెంట్ షాకులు జరగడం బాధాకరమని పేర్కొన్నారు.  రేవంత్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి,  గురుకులాలను సక్రమంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.