16-02-2025 12:31:04 AM
పోస్టింగ్ కొట్టె.. అక్రమాస్తులు పట్టె
ఆమ్యామ్యాలకు అచ్చిరాని గచ్చిబౌలి ఆఫీసు!
౩లక్షలు వెచ్చించి వాస్తుదోషాలు సవరించినా ఫలితం శూన్యం!!
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): లంచం తీసు కుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ గచ్చి బౌలి అడిషనల్ డివిజ నల్ ఇంజినీర్(ఏడీఈ) కొట్టె సతీశ్‌రెడ్డి (43) కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శుక్రవారం తన కార్యాలయంలో ఓ కాంట్రాక్టర్ నుంచి ట్రా న్స్‌ఫార్మర్ కోసం రూ.50వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.
దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ బృందం విచారణ చేపట్టింది. సతీశ్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని, రూ.100 కోట్ల పైచిలుకు అక్రమాస్తులు కూడగట్టినట్టు అధికా రులు గుర్తించారు.
వేల కోట్లకు పడగలెత్తేందుకు పెద్దఎత్తున ఖర్చుపెట్టి గచ్చిబౌలి కార్యాలయంలో పోస్టింగ్ తీసుకున్నట్టు తెలిసింది. గతంలో చర్లపల్లిలో ఏడీఈగా పనిచేసిన కొట్టె సతీశ్‌రెడ్డి పెద్దఎత్తున పైరవీలు చేశాడు. 6 నెలల కింద గచ్చిబౌలికి బదిలీ అయ్యాడు.
అవినీతి కేసుల్లో పట్టుబడొద్దని వాస్తు మార్పులు
ఈ కార్యాలయంలో గతంలో ఇద్దరు అధికారులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారని, తన విష యంలో అలాంటి పొరపాట్లు జరగొద్దని.. వచ్చి రాగానే వాస్తుదో షాలు సవరించుకున్నాడు. దీని కోసం రూ.3 లక్షలు ఖర్చు చేశాడు. పోస్టింగ్ కోసం తాను ఖర్చు చేసిందంతా వడ్డీతో సహా ఏడాదిలోనే వసూలు చేయాలనుకున్నాడు. తా నొక్కటి తలిస్తే దైవమొకటి తలిచిన ట్లు 6 నెలలు తిరగకుండానే ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికాడు.
పలుచోట్ల స్థిరాస్తులు..
ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలోని అధికారుల బృందం మాదా పూర్ అయ్యప్ప సొసైటీలోని సతీశ్‌రెడ్డి నివాసం, అతడి సన్నిహితుల ఇళ్లల్లోనూ ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో హైదరా బాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లా ల్లో 22 ఎకరాల వ్యవసాయ భూమి, ఓపెన్ ప్లాట్లు, విల్లా, భవనాలు ఉన్నట్టు గుర్తించారు. వీటి మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నగరంలో పలుచోట్ల కమర్షియల్ కాంప్లెక్స్‌లు ఉన్నాయని, వాటినుంచి నెలకు లక్షల్లో ఆదాయం వస్తోందని అధికారులు గుర్తించారు. అలాగే సతీశ్‌రెడ్డి ఇంట్లో స్థిరాస్తి పత్రాలు, బంగారం, నగదు స్వాధీ నం చేసుకున్నారు. సోదాల అనంతరం సతీశ్ రెడ్డిని రిమాండ్‌కు తరలించారు. కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశముందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.