14-04-2025 12:43:21 AM
ఎల్బీనగర్, ఏప్రిల్ 13 : స్థానికులు, కార్పొరేటర్ విజ్ఞప్తితో విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసి, కరెంట్ సమస్యను పరిష్కరించారు. సమస్య చెప్పిన వెంటనే పరిష్కరించిన అధికారులకు కార్పొరేటర్ లచ్చిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని మైల్ స్టోన్ కాలనీలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని, లో వోల్టేజ్ సమస్య ఉందని, నూతన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయించాలని స్థానికులు కోరారు.
సమస్యను అధికారుల దృ ష్టికి కార్పొరేటర్ లచ్చిరెడ్డి తెచ్చి పరిష్కరించారు. కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ వెంకటేశ్, పద్మావతి కాలనీ మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, ట్రెజరర్ శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, సునీల్, బాబు, పంచజాను, ఓం ప్రకాశ్, అన్నపూర్ణ, వైష్ణ వి, స్వప్న, సరిత, బీజేపీ డివిజన్ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేవైఎం కార్యదర్శి పవన్ రెడ్డి, డివిజన్ సెక్రటరీ సురేశ్ కుమార్ ఉన్నారు.