calender_icon.png 18 October, 2024 | 3:57 PM

రెడ్ హిల్స్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కరెంట్ కట్

18-10-2024 01:48:24 PM

హైదరాబాద్: నాంపల్లి రెడ్ హిల్స్ లోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో భవన యజమాని కరెంట్ కట్ చేశారు. 6 నెలలుగా అద్దె, కరెంట్ బిల్లు చెల్లించడం లేదని యజమాని ఆరోపించారు. తక్షణమే భవనం ఖాళీ చేయాలని భవన యజమాని ఖురేషి అధికారులను కోరారు. కరెంట్ లేకపోవడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజస్ట్రేషన్లు ఆగిపోయాయి.