calender_icon.png 10 March, 2025 | 9:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరెంట్ బిల్లులు చెల్లించాలి

05-03-2025 08:03:09 PM

కొత్తపేట సెక్షన్ లో విద్యుత్ శాఖ అధికారుల తనిఖీలు.. 

అక్రమంగా కరెంట్ వినియోగించుకున్న వినియోగదారుడికి భారీగా జరిమానా విధింపు...

ఎల్బీనగర్: విద్యుత్ వినియోగదారులు కరెంట్ బిల్లులు సకాలంలో చెల్లించాలని విద్యుత్ శాఖ అధికారులు సూచించారు. పెండింగ్ విద్యుత్ బకాయిలు వసూళ్లలో భాగంగా బుధవారం సరూర్ నగర్ సర్కిల్ పరిధిలోని కొత్తపేట సెక్షన్ లో బిల్ స్టాఫ్ సర్వీస్ లను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఒక సర్వీస్ విద్యుత్ ను అనుమతి లేకుండా వినియోగించుకున్న వినియోగదారుడికి రూ. 75 వేల జరిమానా విధించారు. బకాయిలు ఉన్న వినియోగదారుల సర్వీస్ కనెక్షన్ నిలిపి వేస్తున్నట్లు తెలిపారు.

యజమానులు బకాయిలు మొత్తాన్ని చెల్లించి తమ సర్వీస్ ను పుననరుద్ధరించుకోవాలని కోరారు. వినియోగదారులు తొలగించిన సర్వీసులను బకాయిలు చెల్లించకుండా స్వయంగా పునరుద్ధరించుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  కార్యక్రమంలో జనరల్ మేనేజర్ పి.అంజయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ సి.మాధవరెడ్డి, డివిజనల్ ఇంజినీర్ కేకే రామకృష్ణ, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఆర్. రమణారెడ్డి, అకౌంట్ ఆఫీసర్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజీనీర్లు పాల్గొన్నారు.