బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచులో 27 పరుగుల వద్ద నిలకడగా ఆడుతున్న రిషబ్ పంత్ చక్కని అవకాశం లభించింది. స్టార్క్ బౌలింగ్ లో ఔట్ అయ్యే ప్రమాదం నుంచి పంత్ బయటపడ్డాడు. క్లిష్టమైన క్యాచును ఆసీస్ కాప్టెన్ పాట్ కమిన్స్ వదిలేశాడు. ప్రస్తుతం భారత్ 39 ఓవర్లకు 98 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. క్రీజులో రిషభ్ పంత్ తో పాటు నితీశ్ రెడ్డి (15) ఆడుతున్నారు. బుమ్రా సారథిగా ఆసీస్ తో జరుగుతన్న తొలి టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగింది. కంగారులు విసిరిన బంతులకు భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు.