కరీంనగర్, డిసెంబర్ 25 (విజయక్రాంతి) : ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడమే మా పాలకవర్గ ధ్యేయం అని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధిలో బాగంగా బుధవారం రోజు 21 వ డివిజన్‌లో పర్యటించారు. సీతారాంపూర్ ప్రాంతంలోని బాలజీ నగర్‌లో స్థానిక కార్పోరేటర్ జంగిలి సాగర్ తో కలిసి నగరపాలక సంస్థకు చెందిన 35 లక్షల నిధులతొ తాగు నీటి పైపులైన్ అభివృద్ధి పనులకు భూమీ పూజ చేసి పనులు ప్రారంభించారు.
చేపట్టిన పైపులైన్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. సీతారాంపూర్ ప్రాంతంలోని బాలజీనగర్, సూర్యనగర్ కాలనీలకు 1400 మీటర్ల తాగు నీటి సరఫరా పైపులైన్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ఆర్ బి శాఖ వారి వైఫల్యంతోనే నగరంలో వీ పార్కు వద్ద, ఆర్టీసి వర్కు షాపు వద్ద రాంనగర్ చౌరస్తాలో, టాటా హాస్పిటల్ చౌరస్తాలో, మంచిర్యాల చౌరస్తాల వద్ద వరద నీరు వచ్చి చేరుతుందని, ఈ సమస్యను ఆర్ బి శాఖ త్వరగా తీర్చాలని డిమాండ్ చేశారు. వచ్చే వర్షాకాలం వరకు ఆర్ బి శాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీస్కోని సంబంధిత కల్వర్టులను విస్తరించి నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు.