calender_icon.png 3 February, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంస్కృతి - సంప్రదాయాలు భావితరాలకు అందించాలి...

03-02-2025 07:46:05 PM

బుడుందేవ్ జాతర ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్...

ఉట్నూర్ (విజయక్రాంతి): ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు ఇతరుల కంటే భిన్నంగా ఉంటాయని ప్రకృతినే దైవంగా భావించి పూజలు చేయడం తరతరాలుగా వస్తున్న ఆచారమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్ గ్రామంలో కొలువు తీరిన బుడుందేవ్ జాతర సోమవారం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెస్రం వంశీయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం మెస్రం వంశీయులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పుష్యమాసాన్ని పురస్కరించుకొని అత్యంత పవిత్ర హృదయంతో నియమనిష్టలతో దేవతలను ఆరాధించే సంస్కృతి ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలు గొప్పవని, వాటిని కాపాడుతూ భావితరాలకు అందించాలన్నారు. తదనంతరం ఈ కార్యక్రమంలో మెస్రం వంశీయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.