calender_icon.png 20 January, 2025 | 7:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలి

20-01-2025 12:55:18 AM

రాజేంద్రనగర్, జనవరి 19 : ప్రజలందరూ సంస్కృతి సంప్రదాయాలను పాటించాలని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. ఆదివారం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్వాల్గూడ మల్లన్న స్వామి ఆలయంలో మల్లికార్జునస్వామి కల్యాణోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో మెలగాలన్నారు. గ్రామీణ ప్రాంతంలో జరిగే జాతరలు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని అన్నారు. దేవాలయాల అభివృద్ధికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.