calender_icon.png 8 January, 2025 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి

06-01-2025 02:05:53 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే... 

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(District Collector Venkatesh Dhotre) అన్నారు. సోమవారం ఆసిఫాబాద్ మండలంలోని కుటోద గ్రామంలోని భీమయ్యక్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద రూ:2.5 లక్షలతో ఏర్పాటు చేసిన నీటి సరఫరా విద్యుత్ మోటార్ ను ప్రారంభించారు. ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. విద్యపై దృష్టి సారించాలని యువకులకు సూచించారు. క్రీడలతో మానసిక ప్రశాంతత పాటు శారీరక దృఢత్వం పెంపొందించుకోవచ్చని తద్వారా ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ హైమద్, హైమద్ బిన్ అలీ, గిరిజన సంఘం నాయకులు, గ్రామస్తులు సిడం శంకర్, తిరుపతి, జంగు, పావుగ, భీము, రాము, సోము, జైతు తదితరులు పాల్గొన్నారు.