19-04-2025 11:33:34 PM
అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్...
తిమ్మాపూర్ (విజయక్రాంతి): వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇలాంటి ప్రోగ్రాంలు మాకు రేర్ గా దొరుకుతాయని అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కేంద్రంలో గల జ్యోతిష్మతి టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ టెక్నికల్ సైన్స్ కళాశాలలో ఉత్సవ్ 20 25 వార్షికోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ... స్టూడెంట్ లైఫ్ గోల్డెన్ లైఫ్ అది ఒక్కసారి పోతే మళ్ళీ రాదన్నారు. కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు ధ్యాస అంత కాలేజ్ ను ఎలా డెవలప్ చేయాలనే దానిమీదే ఉందన్నారు.కళాశాలలో చేరిన మీరందరు మంచి కాలేజ్ ను ఎంచుకున్నారు. ఇక్కడి నుంచే మీ లైఫ్ లో రెండు మార్గాలు ఉన్నాయన్నారు.
ఒకటి కష్టపడితే బంగారు భవిష్యత్తుగా మారుతుందని రెండోది జల్సాలు చేసి జీవితం నాశనం చేసుకోవడమని జల్సా కు అలవాటు పడకుండా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. 4ఏళ్లలో మీరు ఎంచుకునే మార్గాలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తామని అన్నారు.కష్టపడిన విద్యార్థి నాలుగేళ్ల తర్వాత సమాజంలో మంచిపేరు తెచ్చుకోవడమే కాకుండా తల్లిదండ్రుల పేరు నిలబెట్టిన వారు అవుతారని అన్నారు. కళాశాల స్నేహం మంచిదై ఉండాలనీ, అలాంటి స్నేహం మనల్ని ఉన్నత స్థానంలో ఉండేలా చేస్తుందన్నారు.సమయం అనేది చాలా విలువైనదనీ, దాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే లైఫ్ బాగుంటుందని చెప్పారు. అనంతరం ఆటపాటలతో డ్యాన్సులు చేస్తూ విద్యార్థులు ఉర్రూతలు ఊగించారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ రీసర్చ్ డెవలప్మెంట్ డైరెక్టర్ కామాక్షి ప్రసాద్, కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు, కళాశాల డీన్ వైశాలి, లతోపాటు అధ్యాపకులు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు.