తిలకించినా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎమ్మెల్యే కోవలక్ష్మి, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సముదాయం ఆవరణలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పిటిజి, ఆదర్శ గిరిజన క్రీడా పాఠశాలల, గిరిజన పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహంకు చెందిన విద్యార్థినిలు చేసిన సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. అంతర్జాతీయ కర్రసాము క్రీడాకారులు చేసిన ప్రదర్శన అందర్నీ ఆకట్టుకున్నాయి. పట్టణానికి చెందిన పలువురు కవులు తమ కవితలు ఆలపించి దేశభక్తిని నింపారు. మత్స్యశాఖలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి ఫ్లూట్ వాయించి అందరి మన్ననలు పొందారు. జిల్లా కలెక్టర్ ఆలపించిన పాటకు విద్యార్థులు కేరింతలతో ఉత్సాహం కనపరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే కుటుంబ సమేతంగా హాజరయ్యారు, ఎమ్మెల్యే కోవా లక్ష్మి,అదనపు కలెక్టర్ లు దీపక్ తివారి, డేవిడ్, డిఆర్డిఓ లోకేశ్వరరావు, డిఆర్డిఓ దత్తారావు, డిడబ్ల్యువో భాస్కర్, వివిధ పాఠశాల విద్యార్థులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.